తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈడబ్ల్యూఎస్' కోటా అమలు చేయాలని హైకోర్టులో పిల్​ - pil on ews reservations in ts hc

విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్​ కల్పించాలని కోరుతూ భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్​ రాజ్​ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 10 శాతం రిజర్వేషన్​ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తున్నారని.. కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కారణంగా ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు.

highcourt, ews reservations, pill
హైకోర్టు, ఈడబ్ల్యూఎస్​ కోటా, తెలంగాణ, పిల్​

By

Published : Jan 4, 2021, 4:56 PM IST

రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ రాజ్​తో పాటు దోరేటి ఆనంద్​ గుప్తా అనే వ్యాపారి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలతో పాటు రానున్న ఉద్యోగాల నోటిఫికేషన్​లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్​లో మాత్రమే అమలు చేస్తున్నారని.. ఇంజినీరింగ్, మేనేజ్​మెంట్ వంటి ఇతర కోర్సుల్లో అమలు కావడం లేదని తెలిపారు.

ఈ కోటా కింద 10శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ 2019లో రాజ్యాంగ సవరణ చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం వంటి కేంద్ర విద్యా సంస్థల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ రాష్ట్రంలో అమలు కాకపోవడం వల్ల ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు నష్టపోయారని అన్నారు.

ఇదీ చదవండి:'ఓటుకు నోటు కేసు అ.ని.శా. కోర్టు పరిధిలోకి రాదు'

ABOUT THE AUTHOR

...view details