Physical Fitness Tests For TS Police Candidates : అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ) లాంటి వాటిని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించేందుకు పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలను నిర్వహించేందుకు 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది.
Physical Tests For TS Police Candidates మొదలు పెట్టిన నాటి నుంచి 25 రోజుల్లో ఈ పరీక్షలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. వీటిని పూర్తిచేస్తే.. ఇక మిగిలి ఉండే తుది రాతపరీక్ష నిర్వహణ సులువేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. కుదిరితే ఈ నెల చివరి వారంలోనే ఈ పరీక్షలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.