తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా.. ముందుగా డిగ్రీ పరీక్షలు - పీజీ ప్రవేశ పరీక్షలు వాయిదా వార్తలు తెలంగాణ

ఈనెల 6 నుంచి జరగాల్సిన పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. పీజీజేఈటీ వాయిదా పడింది. వర్షాల కారణంగా వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ముందుగా జరగాలన్న ఉద్దేశంతో ఈ ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కన్వీనర్​ ప్రొఫెసర్ కిషన్​ తెలిపారు. వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఈ నెల 6 నుంచి, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నవంబర్​ 10 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది.

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా.. ముందుగా డిగ్రీ పరీక్షలు
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా.. ముందుగా డిగ్రీ పరీక్షలు

By

Published : Nov 2, 2020, 7:55 PM IST

ఈనెల 6 నుంచి జరగాల్సిన పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. పీజీజేఈటీ వాయిదా పడింది. డిసెంబరు 1 నుంచి 14 వరకు నిర్వహించాలని సూత్రప్రాయంగా అధికారులు నిర్ణయించారు. వర్షాల కారణంగా వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు జరగాల్సి ఉన్నందున పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.

ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, తెలుగు యూనివర్సిటీల్లో ఎంఎస్సీ, ఎంకాం, తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఓయూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. సోమవారం అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, పరీక్షల కంట్రోలర్లు సమావేశమయ్యారు. ముందుగా డిగ్రీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం ఉన్నందున పీజీజేఈటీ వాయిదా వేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రవేశ పరీక్ష వాయిదా వేసినందున.. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ. 500 చెల్లించి ఈనెల 17 వరకు, రూ. 2 వేలు చెల్లించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కిషన్ వెల్లడించారు. గతంలో రూ. 2 వేల ఆలస్య రుసముతో దరఖాస్తు చేసుకున్న వారికి.. రూ. 1500 వెనక్కి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

వర్షాల కారణంగా వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఈ నెల 6 నుంచి, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నవంబర్​ 10 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details