ఆంధ్రప్రదేశ్‌లో పుర, నగరపాలిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు దాటిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై పిటిషన్లు.. విచారణ వాయిదా
ఏపీలో పుర, నగరపాలిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్లు
పస్తుతం ఏపీలో కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. పుర, నగరపాలిక ఎన్నికల్లో కొత్తవారు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్