తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేయసి కోసం ఠాణాలోనే ఆత్మహత్యాయత్నం - ATTEMPT

నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికొచ్చారు. అక్కడే వచ్చింది అసలు సమస్య. అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల మానసికంగా కుంగిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చి ఠాణాలోనే ఆత్మహత్యకు యత్నించాడు ఓ యువకుడు.

25 శాతం కాలిన గాయాలతో...

By

Published : Mar 26, 2019, 7:54 AM IST

Updated : Mar 26, 2019, 9:48 AM IST

25 శాతం కాలిన గాయాలతో...
ప్రేమించిన యువతితో వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవటం వల్ల ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు యత్నించాడు. లంగర్‌హౌజ్​కు చెందిన ఆదిల్‌... గోల్కొండలో నివాసముంటున్న తన సహవిద్యార్థినితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వివాహానికి అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపం చెందిన ఆదిల్​ ఫిర్యాదు చేసి... నిప్పంటించుకున్నాడని పోలీసులు తెలిపారు.

సకాలంలో స్పందించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పేశారు. 25 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆదిల్​ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Mar 26, 2019, 9:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details