ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ విధి విధానాలతో అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో డోసు కోసం మూడు రోజులపాటు తిరిగినా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు.
'రెండో డోసు కోసం మూడ్రోజులు తిరిగినా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు' - హైదరాబాద్ కరోనా కేసులు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండో డోసు తేదీని ప్రకటిస్తామని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది.. గడువు పూర్తైనా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
difficulties at covid vaccine centers
స్మార్ట్ ఫోన్ లేక ఆన్లైన్లో బుక్ చేసుకోలేక పోతున్నామని కొంతమంది.. రిజిస్టర్ చేసుకున్న లాభం లేదని మరికొంత మంది ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. రెండో డోసు తేదీని ప్రకటిస్తామని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది.. గడువు పూర్తైనా ఎలాంటి సమాచారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే టీకా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: జీవన్ రెడ్డి