తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం కోసం వచ్చారు.. భౌతిక దూరం మరిచారు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన ప్రకటన మందు బాబుల్లో ఉత్సాహాన్ని నింపింది. లాక్​డౌన్​ కారణంగా కొన్ని రోజులుగా మందుకు దూరంగా ఉన్న మద్యం ప్రియులు ఉదయం నుంచే దుకాణాల ఎదుట బారులు తీరారు. భౌతిక దూరం మరిచి.. మందు ఎప్పుడెప్పుడు చేతికొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

people are not maintaining physical distance at the wine shops
మద్యం కోసం వచ్చారు.. భౌతిక దూరం మరిచారు

By

Published : May 6, 2020, 3:33 PM IST

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మద్యం ప్రియులు ఉదయం నుంచే దుకాణాల వద్ద బారులుతీరారు. హైదరాబాద్​ కూకట్​పల్లి ఎల్లమ్మబండలోని బిందువైన్స్​ వద్ద మందుబాబులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కేపీహెచ్​బీ కాలనీలోని వైన్స్ వద్ద మహిళలు సైతం మద్యం కొనుగోలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా పోలీసులు, జీహెచ్​ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

తిరుమలగిరిలో..

తిరుమలగిరిలోని ఓ వైన్స్ ఎదుట మందుబాబు నృత్యం చేస్తూ హల్​చల్ చేశాడు. దాదాపు 42 రోజుల తర్వాత మద్యం లభిస్తుండటం వల్ల ఆనందాన్ని తట్టుకోలేక వైన్స్​ ముందే గంతులు వేశాడు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో..

హైదరాబాద్ నగర శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్‌, కొండాపూర్, మియాపూర్‌, చందానగర్ తదితర ప్రాంతాల్లోనూ మందుబాబులు బారులుతీరారు. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ.. మద్యం ప్రియులు వాటిని పాటించడంలేదు.

సికింద్రాబాద్​ పరిధిలో..

సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, అల్వాల్, చిలకలగూడ, మారేడ్​పల్లి, బోయిన్​పల్లి ప్రాంతాల్లోని దుకాణాల ఎదుటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మందుబాబులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.

మాదాపూర్​, గచ్చిబౌలిల్లో..

హైదరాబాద్ మాదాపూర్, గచ్చిబౌలి, గోపనపల్లి ప్రాంతాల్లోనూ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. కొండాపూర్​లోని ఓ దుకాణం ముందు మహిళలు సైతం మందు కోసం లైన్లలో నిలబడ్డారు.

ముషీరాబాద్​ నియోజకవర్గంలో..

ముషీరాబాద్​ నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలు మందుబాబులతో కిక్కిరిసిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని చిక్కడ్​పల్లి, గోల్కొండ క్రాస్​రోడ్డు, రామ్​నగర్ క్రాస్​రోడ్, ముషీరాబాద్, పార్సిగుట్ట ప్రాంతాల్లో దుకాణాలు తెరవక ముందు నుంచే మద్యం కోసం వరుసల్లో నిలబడ్డారు. రామ్​నగర్ క్రాస్​రోడ్​లోని దుకాణం ముందు భౌతిక దూరం పాటించకుండా నిలబడ్డ వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.

సనత్​నగర్​లో..

సనత్​నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని పలు మద్యం దుకాణాల వద్ద మందు బాబులు హడావిడి చేస్తుండటం వల్ల దుకాణ నిర్వాహకులు పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయించారు. ఫలితంగా కిలోమీటర్​ మేర జనాలు బారులుతీరారు. పలు దుకాణాల ముందు స్త్రీలూ మద్యం కోసం నిలబడ్డారు.

అబిడ్స్​లో..

మరోవైపు సుమారు 40 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవడం వల్ల అబిడ్స్​లోని ఓ షాపు యజమాని కొబ్బరికాయ కొట్టి దుకాణాన్ని తెరిచారు. భౌతిక దూరం పాటించేలా దుకాణం ఎదుట ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మద్యం కోసం వచ్చారు.. భౌతిక దూరం మరిచారు

ఇదీచూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details