హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల సాధనకై సంఘాల నాయకులతో చర్చించాలని సర్కారుకు విన్నవించారు. పెన్షనర్లకు ఐఆర్ 27 శాతం పథకం కింద రూ. 400 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దశల వారీగా పోరాటం కొనసాగిస్తామని మాజీ ఉద్యోగులు స్పష్టం చేశారు.
సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్ల నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద నిరసనకు దిగారు. సర్కారు సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పెన్షనర్ల నిరసన