తెలంగాణ

telangana

ETV Bharat / state

హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు జరిమానా

అనుమతి లేకుండా హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు ప్యారడైజ్ హోటల్ యాజమాన్యానికి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. అనుమతులు లేకుండా హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు రూ. 3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు.

హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు జరిమానా
హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు జరిమానా

By

Published : Sep 3, 2020, 9:54 PM IST

అనుమతి లేకుండా హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు ప్యారడైజ్ హోటల్ యాజమాన్యానికి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. అనుమతులు లేకుండా హోర్డింగులు ఏర్పాటు చేసినందుకు రూ. 3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోకుండా ఇష్టారీతిగా ప్రకటనల నిమిత్తం హోర్డింగులు ఏర్పాటు చేస్తే జరిమానాలు తప్పవని అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ నియమ నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రంగురంగుల ఆకృతులతో విద్యుత్ కాంతులతో పెద్దఎత్తున అనుమతులు లేకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details