ఏపీలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగాకొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 6 లక్షల 35 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 7 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు ఉండగా..ఔట్ ఫ్లో 7లక్షల 48 వేల క్యూసెక్కుల మేర ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.50 అడుగుల నీటిమట్టం ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31వేల 349 క్యూసెక్కులు విడుదలైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేయగా.. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 40 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
ప్రకాశానికి తగ్గిన వరద