కార్పొరేట్ కళాశాలల్లో అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ.. పీడీఎస్‌యూ ఇంటర్‌బోర్డుకు వినతిపత్రం సమర్పించింది. లాక్డౌన్ అనంతరం ఇటీవల ప్రారంభమైన విద్యాసంస్థలు.. విద్యార్థులు హాస్టళ్లలో లేని సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయని నాయకులు మండిపడ్డారు. కళాశాలతో సహా హాస్టల్ ఫీజును.. మొత్తం విద్యా సంవత్సరానికి చెల్లించాలంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'హాస్టళ్లలో లేకున్నా.. ఫీజులు కట్టమంటున్నారు' - కార్పొరేట్ కళాశాలు
రాష్ట్రంలోని పలు కార్పొరేట్ కళాశాలలు విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని పీడీఎస్‌యూ మండిపడింది. ఆ మేరకు నాయకులు ఇంటర్‌బోర్డును కలిసి.. ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'హాస్టళ్లలో లేకున్నా.. ఫీజులు కట్టమంటున్నారు'
అక్రమ ఫీజుల వసూళ్ల కారణంగా.. తల్లిదండ్రులు, విద్యార్థులను చదువు మాన్పించే అవకాశముందని నాయకులు పేర్కొన్నారు. తక్షణమే ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఫీజు కడితేనే బడికి రండి.. ప్రైవేట్ స్కూళ్లలో ఒత్తిడి..