భాజపా సర్కారు వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన మూడు బిల్లులు.. లోపభూయిష్టంగా ఉన్నాయని.. రైతులకు మేలు చేసేవి కావని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఐసీ, రక్షణరంగం, అంతరిక్ష పరిశోధన లాంటి రంగాల్ని ప్రైవేటు పరం చేసినట్లే వ్యవసాయ సహాకార రంగాన్ని సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఆ 3 బిల్లులు రైతులకు మేలు చేయవు: హర్షవర్ధన్ - భాజపా బిల్లులపై హర్షవర్ధన్ రెడ్డి విమర్శలు
భాజపా సర్కారు వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన మూడు బిల్లులు.. లోపభూయిష్టంగా ఉన్నాయని.. రైతులకు మేలు చేసేవి కావని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటను ఇప్పటికే దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం ఉందని.. కొత్తగా మళ్లీ ఈ బిల్లులు ఎందుకని ప్రశ్నించారు. స్థానికంగా పంట పండించిన రైతు ఎక్కడికో వెళ్లి అమ్ముకోగలడా అంటూ నిలదీశారు.
రైతులు పండించిన పంటను ఇప్పటికే దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం ఉందని.. కొత్తగా మళ్లీ ఈ బిల్లులు ఎందుకని హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. స్థానికంగా పంట పండించిన రైతు ఎక్కడికో వెళ్లి అమ్ముకోగలడా అంటూ నిలదీశారు. పండించిన పంటను ఏజెన్సీలకు అమ్ముకునేందుకు ముందస్తుగానే ఒప్పందం చేసుకునే బిల్లు సైతం.. ధాన్యం దళారుల చేతుల్లోకి వెళ్లడానికే అన్నారు. ముందస్తు ఒప్పందంతో ధాన్యం కొనుగోలు చేసిన ఏజెన్సీలు.. నిల్వలను దాచి ఉంచి ధరల్ని పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు బిల్లుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'వ్యవసాయాన్ని ఫలసాయంగా మార్చేందుకే బిల్లులు'
TAGGED:
bjp introduced bills news