తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస, భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

తెరాసకు ఓట్లు అడిగే హక్కుందా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ ప్రశ్నించారు. కరోనా విజృంభణ సమయంలో ఫాం​హౌస్​ నుంచి బయటకు రాలేదని విమర్శించారు. భారీ వర్షాలకు వందమంది వరకు మరణిస్తే కనీసం పరామర్శించలేదన్నారు. తార్నాక డివిజన్​ కాంగ్రెస్​ అభ్యర్థి తరఫున ఉత్తమ్​ ప్రచారం నిర్వహించారు.

uttam
uttam

By

Published : Nov 24, 2020, 6:50 AM IST

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అనిత అమర్నాథ్ గౌడ్ తరఫున ఉత్తమ్​ ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

తెరాసకు ఓటు అడిగే హక్కు లేదని ఉత్తమ్​ ప్రశ్నించారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్​ ఏం చేశారన్నారు. హైదరాబాద్​ నగరానికి భాజపా ఏం చేసిందని నిలదీశారు. ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

తెరాస, భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదు : ఉత్తమ్​

ఇదీ చదవండి :30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి: రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details