తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజగోపాల్ రెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసు

ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ... రెండ్రోజుల క్రితమే ప్రత్యేకంగా సమావేశంది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

By

Published : Jun 19, 2019, 11:19 PM IST

కాంగ్రెస్​కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న నల్గొండ పర్యటనలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని తక్కువ చేస్తూ మాట్లాడంతో పాటు తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానిపై విమర్శలు చేశారు.
గత ఏడాది సెప్టెంబర్​లోనూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై రాజగోపాల్​రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పట్లో ఆయన వ్యవహారశైలిపై సుదీర్ఘంగా సమీక్షించిన క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని క్రమశిక్షణా సంఘం తీవ్రంగా తప్పు పట్టింది. రెండు రోజుల కిందట సమావేశమైన క్రమశిక్షణా సంఘం రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలిపై సుదీర్ఘంగా చర్చించింది.
అప్పుడే సోకాజ్ నోటీసు సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ... దానిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియాలకు నివేదించింది. ముగ్గురు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజగోపాల్​ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కమిటీ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details