revanth reddy fires on cm kcr: ప్రభుత్వ వ్యవస్థలను తెరాస, భాజపా దుర్వినియోగం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు మోదీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, మోదీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.
Revanth reddy on kcr and modi:ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్... ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోదీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతిఆయోగ్ సమావేశానికి హాజరై.... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.