Revanth reddy: రాష్ట్ర పోలీసుల వైఖరిపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను కలిసి చర్చించి భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలనుకుంటే.. వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వివరించారు. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు తమను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచి తన హక్కులను కాలరాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Revanth reddy: పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు
Revanth reddy: రాష్ట్ర పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసులు పదే పదే గృహ నిర్బంధం చేస్తూ.. తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి ఇంట్లోకి పోలీసులు వచ్చారని తెలిపారు.
Revanth reddy: పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు
పదే పదే గృహనిర్బంధం చేస్తూ తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. అదే విధంగా లిఖితపూర్వక సమాచారం లేకుండా పోలీసులు ఇంటి చుట్టూ మోహరిస్తున్నారన్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారని ఫిర్యాదులో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నానన్నారు. రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: