PCC Campaign Committee Meeting : కొద్ది నెలల్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ ఓటర్లనాడీ పట్టేందుకు దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలుపరచాల్సిన ప్రచారవ్యూహాలపై.. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ అధ్యక్షతన కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ సమావేశమైంది. ఇందిరాభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే హాజరయ్యారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏలాంటి ప్రచార కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్లాలన్న అంశంపై సభ్యులతో చర్చించారు. సాధ్యసాధ్యాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే దిశనిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు, భారత్ రాష్ట్ర సమితిపై ఎదురుదాడి వంటి అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను..ఇంటింటికి చేర్చేందుకు శ్రేణులు సహా అనుబంధ విభాగాల్ని పూర్తిస్థాయిలో మోహరించాలని నిర్ణయించారు.
Congress leaders protest : 'వరద బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే'
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి ఓటు వేయాలని జనం భావిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళిక బద్దంగా.. ప్రచార వ్యూహంతో ముందుకు పోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..పార్లమెంటు సమావేశాలు ఉండడంతో ఆయన రాలేకపోయారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండడంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కన్వీనర్ అజ్మత్ హుసేన్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్న ఆశావహులు :మరోవైపు దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. హస్తం పార్టీకి జనాల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుడటంతో.. పార్టీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకర్గంవర్గం మినహా.. రాష్ట్రంలోని మిగిలిన 16 చోట్ల పోటీకి పెద్దసంఖ్యలో ఆశావహులున్నారు.
Telangana Assembly Elections 2023 :రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 40 నుంచి 50 చోట్ల వివాదం లేకుండా ఒక్క అభ్యర్థే పోటీలో ఉన్నట్లు పీసీసీ అంచనావేస్తోంది. అయితే వారిని సర్వేల ఆధారంగా ముందే ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. నెలాఖరున లేదా వచ్చేనెల మొదటి వారంలో.. తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందనిపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆశావహాలు ఇప్పటినుంచే హైకమాండ్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నాయి. తమ నియోజకవర్గాల్లో తాము ఇప్పటివరకు చేసిన ర్యాలీలు, ఆందోళనల గురించి పార్టీ పెద్దల ముందు ఏకరవు పెడుతున్నారు. తమకే టికెట్ ఇప్పించేలా చూడాలని లాబీయింగ్ కూడా ప్రారంభించారు.
Congress on Assembly Sessions 2023 : అసెంబ్లీలో బీఆర్ఎస్ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న కాంగ్రెస్
Revanthreddy Fires on BRS Leaders : 'ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఏ దందాలో చూసినా బీఆర్ఎస్ నేతలే'