Pawan Kalyan Shocking Comments on AP CM YS Jagan ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తే నేనే చెప్తా Pawan Kalyan Shocking Comments on AP CM YS Jagan : జనేసన పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చామని వైసీపీ ప్రచారం చేస్తోందని.. ఆ కూటమి నుంచి బయటకు వస్తే మాత్రం తాను కచ్చితంగా ఆ విషయాన్ని చెబుతానని తెలిపారు. తాము ఎన్డీఏ కూటమిలో ఉంటే మీకేందుకు.. లేకపోతే మీకెందుకని వైసీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ భయపడాల్సిన అవసరం లేదు.. కానీ భయపడుతున్నారంటే తమ కూటమికి బలం ఉందని ఒప్పుకున్నట్లేనని పవన్ వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఒక రోడ్డు వేయలేని, వంతెన కట్టలేని సీఎం జగన్‌కు ఓట్లెందుకు వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తాము ఎన్డీఏలో లేమంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2024లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం(TDP-Janasena Allience) ఏర్పడుతుందని పవన్ స్పష్టం చేశారు.
జనసేన- టీడీపీ అధికారంలోకి రాగానే పెంచిన మద్యం ధరలు తగ్గిస్తామని పవన్ హామీ ఇచ్చారు. మహిళలు ముందుకొచ్చి అడిగిన ప్రతీచోట మద్యం నిషేధిస్తామని పవన్ స్పష్టం చేశారు. మద్యపానం వద్దన్న గ్రామాలకు అదనపు నిధులు ఇచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మద్యపానం పూర్తిగా నిషేధిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు కల్తీ, నాసిరకం మద్యం అమ్మి ఆడపడుచుల పుస్తెలు తెంపుతున్నారని జనసేనాని ఆవేదన చెందారు.
Pawan Kalyan Sensational Comments: జగన్ ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు.. విపత్తు: పవన్ కల్యాణ్
"175 కొట్టెస్తామని ఆత్మ విశ్వాసం ఉన్న వైసీపీకి.. జనసేన ఒక లెక్కా.. టీడీపీ ఓ లెక్కా. పైగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు మేము ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాం అని మాట్లాడుతుంటే. మేము ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటీ.. దాని బయటుంటే ఏంటీ. మీరు మమ్మల్ని చూసి బయపడుతున్నారంటే.. మమ్మల్ని చూసి భయపడుతున్నారని అర్థం" -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
Flexi Dispute Between Janasena and YCP in Pedana: పెడనలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం.. రంగంలోకి దిగిన పోలీసులు
Pawan Kalyan fire on YCP MLA: ఐదేళ్లు అధికారంలో ఉంటేనే ఇక్కడి ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి కొమ్ములు వచ్చాయని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే, ఆయన కుమారుడి కొమ్ములు విరిచి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం మారిన రోజున కొల్లేరు మొత్తం శుద్ది చేస్తామన్న పవన్.. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నీటి సమస్య తీర్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇంటర్ ధ్రువపత్రాలు ఇవ్వలేని వారికి ఓట్లు అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. కొల్లేరును వైసీపీ నేతలు కొల్లగొడుతున్నారని పవన్ మండిపడ్డారు. కైకలూరులోని ఓ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 80 శాతం ఖర్చు చేసినా.. ఇంకా నిర్మాణం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని జనసేన అధినేత ధ్వజమెత్తారు. ఒక్క వంతెన కట్టలేక 45 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలా రోడ్లు, వంతెనలు వేయలేని ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలా అంటూ ప్రశ్నించారు.
TDP Leader Kollu Ravindra Fire on Police Notices: పవన్‌కు పోలీసుల నోటీసులపై కొల్లు రవీంద్ర ఆగ్రహం
Pawan Comments on NDA : 'తాను సీఎం కావడం కన్నా ప్రజల శ్రేయస్సే ప్రధానం. సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్న జగన్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారు. ఆయన నొక్కని బటన్లు కోకొల్లలు. వైసీపీ నేతలు మొత్తం 175 సీట్లు తమకే వస్తాయని చెబుతున్నారు కదా. మీరు అద్భుతంగా పాలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవారని' జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఛాలెంజ్ విసిరారు.
Pawan Kalyan Varahi Yatra : ఒకసారి వైసీపీ నేతలు తనపై దాడి చేయడానికి కార్యాలయం చుట్టూ మోహరించారని.. అయినా పారిపోకుండా ఆఫీసులోనే కూర్చుకున్నానని జనసేన అధినేత అన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే.. మీ కార్యాలయాల్లోనే ఉండడంటూ హెచ్చరించారు. కైకలూరులో తన కోసం వచ్చే జన సైనికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. 2019లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొని నిలబడిన వ్యక్తిని.. అలాంటిది జగన్‌కు భయపడతానా అంటూ సవాల్ విసిరారు.
Pawan Kalyan met Chandrababu in Rajahmundry Jail: జైల్లో చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ ములాఖత్.. భువనేశ్వరి, బ్రాహ్మణిలకు పరామర్శ