తెలంగాణ

telangana

ETV Bharat / state

చికిత్సకు నోచుకోని ప్రాణం - patient-died-with-heart-attack

హైదరాబాద్​ తార్నాకలోని ఓ ఆసుపత్రిలో గురువారం చికిత్స కోసం వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈసీజీ తీయించుకొని చికిత్సకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడు రామంతపూర్​కి చెందిన గణేష్​గా గుర్తించారు.

చికిత్సకు నోచుకోని ప్రాణం
patient-died-with-heart-attack

By

Published : Jan 25, 2020, 5:50 AM IST

హైదరాబాద్​ తార్నాకలోని పద్మావతి ఆసుపత్రిలో గురువారం ఓ వ్యక్తి వైద్య చికిత్సల కోసం వచ్చి గుండెపోటుతో మరణించాడు. రామంతపూర్​కు చెందిన గణేష్​(38) ఛాతి నొప్పిగా ఉందని స్థానిక డాక్టర్​ని సంప్రందించగా... వెంటనే తార్నాకలోని పద్మావతి ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. అక్కడకు వెళ్లిన గణేష్‌ను ఈసీజీ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈసీజీ పూర్తై చికిత్సకు సిద్ధమవుతున్న తరుణంలో రిసెప్షన్​ కౌంటర్​ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలాడు​. అనంతరం వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధరించారు. ఆసుపత్రికి ఒక్కడే వచ్చాడని తెలుసుకున్న సిబ్బంది సంబంధీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. గణేష్​కు ముగ్గురు సంతానం ఉండగా... ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

patient-died-with-heart-attack

ABOUT THE AUTHOR

...view details