సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలకు ట్యూషన్ ఫీజుల పేరుతో గత సంవత్సరం మాదిరిగానే ఫీజులు వసూలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి యాజమాన్యంతో చర్చలు జరిపారు. త్వరలో ట్యూషన్ ఫీజుల తగ్గింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడం వల్ల వెనుదిరిగారు.
ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్థల ఫీజులుం - Online classes latest news
ఒక వైపు నగరంలో కరోనా కేసుల వ్యాప్తి భారీగా పెరిగిపోతుంటే…మరోవైపు కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులకు మొబైల్స్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్థల ఫీజులుం
చిన్న పిల్లలకు ఆన్లైన్ క్లాసుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తల్లిందడ్రులు పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. త్వరలో పాఠశాల యాజమాన్యం నుంచి నిర్ణయం సానుకూలంగా రాకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
TAGGED:
Online classes in Hyderabad