తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లల సంరక్షణకు సోసైటీ ఫర్ సైబరాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్

తల్లిదండ్రులకు కరోనా సోకితే పిల్లలకు రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు ముందుకొచ్చారు. సోసైటీ ఫర్ సైబరాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్​తో కలిసి సంరక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ప్రధానంగా కొవిడ్​తో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

parents attack covid then children's protection
సోసైటీ ఫర్ సైబరాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్

By

Published : May 5, 2021, 6:47 PM IST

కరోనా బారిన పడిన దంపతుల పిల్లలను సంరక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు నడుం బిగించారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్​తో కలిసి సంయుక్తంగా సంరక్షణ కేంద్రాలను ప్రారంభించారు. నగరంలో ప్రధానంగా కొవిడ్​తో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగండ్ల, హఫీజ్‌పేట్‌, మధురానగర్‌ ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్నారులు కరోనా బారిన పడితే వీటిలోనే ఐసొలేషన్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక హెల్ప్​ లైన్ ఏర్పాటు

కరోనా సోకని వారు కూడా ఆయా కేంద్రాల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు వివరించారు. ఏడు నుంచి 14 ఏళ్లు కలిగి ఉన్న చిన్నారులు కేంద్రాల్లో ఉండవచ్చని తెలిపారు. రెండు వారాల పాటు చిన్నారులు కేంద్రాల్లో ఉండవచ్చని సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందుకోసం హెల్ప్​ లైన్‌ నంబర్‌ 080-45811215 ను సంప్రదిస్తే షీ బృందాల సభ్యులు నేరుగా వెళ్లి చిన్నారులను తీసుకువచ్చి ఆయా కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ చిన్నారులకు అన్నీ ఉచితంగానే అందిస్తున్నట్లు వివరించారు. నిత్యం వాలంటీర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రస్తుతం మూడు కేంద్రాల్లో దాదాపు 60 మంది చిన్నారులు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.

సోసైటీ ఫర్ సైబరాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్

ఇదీ చూడండి:లాక్‌డౌన్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేదు: సీఎస్‌

ABOUT THE AUTHOR

...view details