తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టులో విలీన పంచాయితీ - TOWNS

మున్సిపాలిటిల్లో పంచాయతీలను విలీనం చేయటం వల్ల నష్టపోతామని గ్రామీణులు ... కాదు కాదు.. పట్టణాభివృద్ధిలో భాగంగానే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్న ప్రభుత్వం..  హైకోర్టులో ఎవరి వాదనలు వారివి...!

ఏకపక్షమా... అభివృద్ధి మంత్రమా..?

By

Published : Feb 5, 2019, 4:15 PM IST

ఏకపక్షమా... అభివృద్ధి మంత్రమా..?
మున్సిపాలిటీల్లో పంచాయతీలను విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం వాదనలు ముగిసాయి. పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ చట్టం సెక్షన్‌ 3(ఎ)ను సవాలు చేస్తూ దాఖలైన 120కి పైగా పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
గ్రామసభ నిర్వహించి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం కార్యాలయాల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. వ్యవసాయేతర రంగాలపై అధారపడిన జనాభా, జనసాంద్రత, తలసరి ఆదాయం, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పంచాయతీల విలీనం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోల్పోతారన్నారు.
ఇదిలా ఉండగా... అన్నీ అధ్యయనం చేసిన తర్వానే విలీన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తరఫు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని, దీనికి సంబంధించి పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని వివరించారు.
ఇరు వైపులా వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details