సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ శాసనసభ ఉపసభాతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవం కోసం తెరాస చేసిన ప్రయత్నలు ఫలించాయి. కేటీఆర్ అసెంబ్లీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి మద్దతు కోరడంతో వారు అంగీకరించారు. కాంగ్రెస్, మజ్లిస్, భాజపా మద్దతుతో డీప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం అధికారికంగా ప్రకటిస్తారు. సికింద్రాబాద్‌కు చెందిన పద్మారావు గౌడ్ 1977లో యువజన కాంగ్రెస్‌లో చేరారు. మోండా డివిజన్ నుంచి 1986, 2002లో కార్పొరేటర్‌గా గెలిచారు. తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2004, 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రిగా పనిచేశారు.