పేద పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు సాలరే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎల్లప్పుడు ముందంజలో ఉంటుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఓమర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాల భవనానికి అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి శంకుస్థాపన చేశారు.
చాంద్రాయణగుట్టలో పాఠశాల భవనానికి ఓవైసీ బ్రదర్స్ శంకుస్థాపన
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఓమర్ కాలనీలో పాఠశాల భవనానికి ఓవైసీ బ్రదర్స్ శంకుస్థాపన చేశారు. సాలరే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 11వ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
చాంద్రాయణగుట్టలో పాఠశాల భవనానికి ఓవైసీ బ్రదర్స్ శంకుస్థాపన
ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పది పాఠశాలల్లో పేదలకు ఉచిత విద్య అందిస్తున్నామని ఓవైసీ తెలిపారు. ఈ రోజు నజం ఉన్నిసా ఎడ్యుకేషనల్ పేరుతో 11వ పాఠశాలకు నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పేద పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు.