ప్రధాని పిలుపు మేరకు ఆదివారం రోజు జనతా కర్ఫ్యూను పాటించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 250కి పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. 121 ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం 12 మాత్రమే నడుస్తాయన్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బయలుదేరే అన్ని మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేయబడ్డాయని ప్రకటించారు.
జనతా కర్ఫ్యూ కోసం 250కి పైగా రైళ్లు రద్దు
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 250కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. 121 ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం 12 మాత్రమే నడుస్తాయని పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూ కోసం 250కి పైగా రైళ్లు రద్దు
అప్పటికే బయలుదేరిన దూర ప్రాంతాల సర్వీసులు మాత్రమే కొనసాగుతాయని రాకేష్ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని వెయిటింగ్ హాళ్లు, రిటైరింగ్ హాల్స్, పుడ్ స్టాల్స్ అన్ని కూడా రేపు మూసివేస్తున్నామని సీపీఆర్వో స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత