హైదరాబాద్ వనస్థలిపురంలోని హరిణి వనస్థలి జాతీయ పార్క్లో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల వేతనాలు పెంచలేదని, ప్రస్తుతం ఇచ్చే ఏడెనిమిదివేల జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సమ్మెకు దిగిన వనస్థలి జాతీయ పార్క్ ఉద్యోగులు
హైదరాబాద్లోని వనస్థలి జాతీయ పార్క్లో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
'చాలీచాలనీ జీతాలతో కుటుంబపోషణ భారమైంది'