ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ ఆఫీస్లో పనిచేసే ముగ్గురు సిబ్బందిని విద్యార్థులు చితగ్గొట్టారు. అద్దాలు, ఫర్నీచర్, టెలిఫోన్, ధ్వంసం చేశారు. ఆదివారం ఓయూలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ వద్ద ఓ విద్యార్థి మరో మహిళతో నిలబడి ఉంటే తాము అక్కడ ఉండకూడదని హెచ్చరించామని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఇది దృష్టిలో ఉంచుకుని సోమవారం సదరు విద్యార్థి మరో 30 మంది విద్యార్థులను తీసుకునివచ్చి తమపై ఆకారణంగా దాడి చేశారని వివరించారు. సెక్యూరిటీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్, జయశంకర్, కిరణ్ అనే సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఓయూలో సెక్యూరిటీ సిబ్బందిని చితగొట్టిన విద్యార్థులు
ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగడం వల్ల ఓయూలో ఘర్షణ వాతావరణం తలెత్తింది.
ఓయూలో సెక్యూరిటీ సిబ్బందిని చితగొట్టిన విద్యార్థులు
Last Updated : Aug 20, 2019, 8:39 AM IST