తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.75 కోట్ల లోటు బడ్జెట్​కు ఉస్మానియా ఆమోదం - బడ్జెట్​ కేటాయింపులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం బడ్జెట్​పై పాలకమండలి సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది రూ.75 కోట్ల లోటు బడ్జెట్​కు ఆమోదం తెలిపింది.

ఓయూ విద్యాలయం

By

Published : Mar 28, 2019, 9:27 AM IST

ఓయూలో బడ్జెట్​ కేటాయింపులపై చర్చ
ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలకమండలి రూ.75 కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ను ఆమోదించింది. ఓయూలో వీసీ రామచంద్రం ఆధ్వర్యంలో సమావేశమైన పాలకమండలి బడ్జెట్​పై చర్చించింది. వివిధ మార్గాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 542 కోట్ల 66 లక్షల రూపాయలు అంచనా వేయగా... రూ. 617 కోట్ల 66 లక్షల వ్యయాన్ని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి రూ.309 కోట్ల బ్లాక్​ గ్రాంట్లు రానున్నట్లు బడ్జెట్​లో పేర్కొన్నారు.

కేటాయింపులు ఇలా..

వివిధ విద్యా విభాగాల నుంచి ఫీజులు, ఇతర మార్గాల ద్వారా 165 కోట్ల రూపాయలు గ్రాంట్​ వస్తుందని అంచనా వేశారు. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పింఛన్లు, పరిపాలన అవసరాలకు రూ.485 కోట్లు కేటాయించారు. శతాబ్ది భవన నిర్మాణానికి రూ.25 కోట్లు, ఇతర మౌలిక వసతుల కోసం రూ.85 కోట్ల 75 లక్షలు కేటాయించారు.

ఇదీ చదవండి :రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం

ABOUT THE AUTHOR

...view details