భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా - తెలంగాణ తాజా వార్తలు
18:59 October 13
భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా
వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం, గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ, కేయూ, జేఎన్‌టీయూహెచ్ ప్రకటించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగతా పరీక్షలు ముందుగా నిర్ణయించినట్లు యధావిధిగా నిర్వహించనున్నారు.