తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం - తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలు

రాష్ట్రంలో నేడు కొత్త ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషీయో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు.

Orders nominating MLCs to the telangana Council
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

By

Published : Nov 15, 2020, 11:05 PM IST

Updated : Nov 16, 2020, 3:04 AM IST

తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలుగా బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు ఈ ముగ్గురి నియామకానికి ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు.

రాష్ట్ర శాసనమండలిలో ఎన్నికైన తొలి ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న గుర్తింపు పొందగా... ఈయన నియామకంతో మండలిలో ఎస్​సీ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. సారయ్య నియామకంతో బీసీ ఎమ్మెల్సీల సంఖ్య తొమ్మిదికి చేరింది. మండలిలో తొలి ఆర్యవైశ్య సభ్యునిగా దయానంద్‌ గుర్తింపు పొందారు.

ఈ ముగ్గురు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జీహెచ్​ఎంసీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు. నూతన ఎమ్మెల్సీల నియామకంతో మండలిలో మొత్తం 40 స్థానాలు భర్తీ అయినట్లైంది. తెరాస నుంచి 35 మంది, మజ్లిస్‌ రెండు, ఉపాధ్యాయ, కాంగ్రెస్‌, భాజపా నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చూడండి :హామీలన్నీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే: దాసోజు శ్రవణ్​

Last Updated : Nov 16, 2020, 3:04 AM IST

ABOUT THE AUTHOR

...view details