రాష్ట్రంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూమిపై ఉన్న భద్రత, భరోసాలు భయంగా మారాయని విపక్షాలు విమర్శించాయి. ధరణి పోర్టల్ అమలులోకి తెచ్చినప్పుడు జరిగిన తప్పులను ఎందుకు సవరించడం లేదని నాయకులు నిలదీశారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సమయంలో.. లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలో పడటంతో రైతులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆరోపించారు. ధరణి భూ సమస్యలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Oppositions: 'ధరణి పోర్టల్ వచ్చాక భూమిపై ఉన్న భద్రత భయంగా మారింది'
ధరణి భూ సమస్యలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సెక్షన్ 22 ప్రకారం సవరించాల్సి ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. పాస్‌బుక్కులు ఇచ్చినా భూములు అందులో ఎక్కలేదని రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు అన్నారు. ప్రకృతి వనాల పేరుతో అడవులను కొట్టేసి.. ఆ ప్రాంతంలో మొక్కలు నాటుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. అన్ని గొంతుకలు కలిసి వస్తే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించగలమని అన్నారు.
ఇదీ చూడండి: Massive Theft: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ... రూ.55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్