తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటాపోటీగా విపక్షాల ప్రచారాలు - రంగంలోకి దిగిన జాతీయ నాయకులు

Opposition Parties Election Campaign In Telangana : అధికార బీఆర్ఎస్​ను గద్దె దించటమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు సైతం రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Opposition Parties Election Campaign In Telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 8:32 AM IST

పోటాపోటీగా విపక్షాల ప్రచారాలు - రంగంలోకి దిగిన జాతీయ నాయకులు

Opposition Parties Election Campaign In Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యకు మద్దతుగా మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థిని మట్ట రాగమయి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలో భట్టికి మద్దతుగా ఆయన తనయుడు సూర్య విక్రమాదిత్య కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.

Congress Election Campaign in Telangana 2023: మధిర ఎంపీపీ లలిత.. భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ముదిగొండ మండలం బాణాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి.. కరెంటు అంశంలో కాంగ్రెస్‌ పట్ల సీఎం కేసీఆర్‌ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా ఇందిరమ్మ రాజ్యమేనని భట్టి తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌ మద్దతుగా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ ప్రచారంలో పాల్గొన్నారు.

పోటాపోటీ ప్రచారం..రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి.. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. నల్గొండలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో.. ఆ పార్టీ జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వికార్ రసూల్ వాని పాల్గొని అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో గ్రంథాలయ మాజీ ఛైర్మన్ స్వతంత్ర అభ్యర్థి పిన్నాని సంపత్.. ఉత్తమ్‌కుమారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు ప్రచారం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య.. మోటకొండూరులో నిర్వహించిన ప్రచారంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ పాల్గొని కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రజలను కోరారు.

ప్రచారంలో నయా రూట్ - ఏఐ టెక్నాలజీతో ఖర్చు తగ్గించుకుంటున్న అభ్యర్థులు

స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని తొర్రూరు మండలంలోని గ్రామాల్లో పర్యటిస్తూ తనకు ఓటేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. మెదక్‌ జిల్లా శివంపేట మండలంలో నర్సాపూర్‌ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి.. ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ, ఓట్లు అభ్యర్థించారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌కు మద్దతుగా ఆ పార్టీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి.. రాందాస్‌ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. కేసీఆర్‌ను గద్దెదించే వరకు తాను విశ్రమించబోనని విజయశాంతి తెలిపారు.

Telangana Assembly Elections 2023: అదిలాబాద్ జిల్లా బోథ్ కాంగ్రెస్ అభ్యర్టి ఆడే గజేందర్ ఇచ్చోడ మండలంలో ప్రచారం నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలో హుజూరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి వొడితల ప్రణవ్‌.. ఎన్నికల ప్రచారం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం.. గంగాధర మండలంలో ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం మీనాజీపేట సమీపంలో ఎన్నికల ప్రచారం వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల పొత్తుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. టీజేఎస్, సీపీఐతో సమన్వయంతో ముందుకెళ్లేలా ఈ కమిటీని ప్రకటించారు.

కాంగ్రెస్​కు ముస్లిం ఆర్గనైజేషన్స్ ఐకాస మద్దతు..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్‌ ఐకాస ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్‌ పార్టీలు ఒకటేనని ఆ సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ పత్రిక ప్రకటనలు ఇస్తున్న తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఖండించారు. ప్రజలకు తామిచ్చిన గ్యారంటీలు ఇప్పటికే అమలవుతున్నాయన్న ఆయన.. అవినీతి బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు చోట్ల కూడా గెలిచే అవకాశం లేదని.. కాంగ్రెస్‌ 80సీట్లకు పైగా సాధిస్తుందని కాంగ్రెస్‌ నేతలు బెల్లయ్యనాయక్‌, బలరాం నాయక్‌ ధీమా వ్యక్తం చేశారు.

గెలుపే లక్ష్యంగా తాయిలాల పంపిణీపై అభ్యర్థుల ఫోకస్ - ఓటర్లు కోరినవీ కోరనివి అన్నీ ఇచ్చేస్తున్నారుగా

BJP Election Campaign in Telangana2023 :సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రచారం నిర్వహించిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. మల్లన్నసాగర్ భూనిర్వాసితులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదగాని శ్రీనివాస్‌ గౌడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తుంగతుర్తి బీజేపీ అభ్యర్థి కడియం రాంచంద్రయ్య అడ్డగూడూర్ మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ఓట్లు అభ్యర్థించారు. మెదక్ బీజేపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ రామాయంపేట మండలంలో ప్రచారం నిర్వహించారు. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రజా ఆశీర్వాద పాదయాత్ర నిర్వహించారు.

బీజేపీకి మద్దతుగా పురందేశ్వరి ప్రచారం..హైదరాబాద్ నాంపల్లి బీజేపీ అభ్యర్థి రాహుల్ చంద్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్బీనగర్‌ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లోని కాలనీల్లో సనత్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం నిర్వహించారు. కేపీఎచ్​బి కాలనీలో రోడ్‌షో నిర్వహించిన ఆమె.. జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమాళై రోడ్‌షో నిర్వహించారు. అనంతరం, చందానగర్‌లో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

హైదరాబాద్‌లో జరిగిన మత్స్యకారుల దినోత్సవసభలో ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజుకు గంగపుత్ర సంఘం నేతలు మద్దతు ప్రకటించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ లక్ష్మణ్.. బీఆర్ఎస్​ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కరీంనగర్‌ 53వ వార్డులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు మంత్రి గంగుల చేసిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పురపాలక పరిధిలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ ప్రచారంలో కేటీఆర్‌ తనపై చేసిన ఆరోపణలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు.

అధికారంపై కన్నేసిన కాంగ్రెస్ - పోల్​ మేనేజ్​మెంట్​పై స్పెషల్ ఫోకస్ - నేడు అలంపూర్​లో ఖర్గే సభ

జగదీశ్​రెడ్డిని గెలిపిస్తే - సూర్యాపేటకు డ్రై పోర్టు ఇప్పించే బాధ్యత నాది : సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details