బత్తాయి రైతుల సౌకర్యార్థం దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌ను 24 గంటలూ తెరచి ఉంచేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆసియాలోనే అతిపెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్‌గా పేరొందిన ఆజాద్‌పూర్ మార్కెట్‌కు ఏటా.. సుమారు 30వేల మెట్రిక్ టన్నుల బత్తాయి పండ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈ సౌకర్యం కల్పించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు అధికారులు వెల్లడించారు.
చేతికి వచ్చిన పంటను దిల్లీ మార్కెట్‌కు తరలించే ప్రక్రియలో రెండు తెలుగు రాష్ట్రాల బత్తాయి రైతులు పడుతున్న కష్టాలను 'ఈటీవీ' కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన హోంశాఖ అధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.