Onions Price in Telangana 2023 :పెరిగిన ఉల్లి ధరలతో(Onions Price Rises) సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ఆగస్టు 5న రైతు బజారులో ఉల్లిగడ్డ కిలో ధర రూ.20 ఉంటే ప్రస్తుతం రూ.28కు అమ్ముతున్నారు. సూపర్‌బజార్, రిటైల్ మార్కెట్లలో ఆగస్టులో కిలో ధర రూ.25 ఉంటే నేడది రూ.35 నుంచి 40కి చేరింది. ఉల్లి ధరలు కూడా అమాంతం పెరిగేవే కానీ.. కేంద్రం ఉల్లిని విదేశీ ఎగుమతులపై పన్ను 40 శాతానికి పెంచడంతో ధరలు అందుబాటులో ఉన్నాయని మలక్‌పేట మార్కెట్ స్పెషల్‌గ్రేడ్ సెక్రటరీ దామోదర్ పేర్కొన్నారు.
టమాటా పంటకు సీసీ కెమెరాలతో రక్షణ.. చోరీ భయంతో రైతుల జాగ్రత్తలు
ప్రభుత్వ సంస్థ నాఫెడ్ దగ్గర కూడా తగినన్ని నిల్వలున్నాయన్నారు. వచ్చే నవంబరులో కొత్త పంట కూడా మార్కెట్లోకి రానుందన్నారు. ప్రస్తుతం నగరానికి 5 వేల నుంచి 6 వేల క్వింటాళ్లు మాత్రమే రావడంతో ధరలు కాస్త పెరుగుతున్నాయన్నారు. వాస్తవానికి గతంలో నగరానికి రోజూ 8 వేల క్వింటాళ్ల వరకూ వచ్చేదని.. ఆ మేరకు వస్తే కిలో రూ.20 నుంచి రూ.25కి దొరుకుతుందని పేర్కొన్నారు. ఉల్లి ధరలు నవంబరు వరకూ నెమ్మదిగా పెరిగినా తర్వాత తగ్గుముఖం పడతాయని దామోదర్ తెలిపారు.
Onion Prices in Raithubazar Hyderabad : ఎండాకాలంలో కురిసిన అకాల వర్షాలతో..పంటలుచేతికందే సమయానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయాల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. గడిచిన నెల రోజుల క్రితం వరకూ పెరిగిన ధరలతో టమాటా(Tomato Prices) వినియోగదారులను హడలెత్తించింది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేసరికి.. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.