మొన్నటి వరకు ఉల్లి ధరలు కొండెక్కి కూర్చుంటే... ఇప్పుడు టమాట ధర కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతోన్న కూరగాయల ధరలతో సాధారణ వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్‌లోని రైతు బజార్లు, ఇతర మార్కెట్‌లలో కిలో టమాట రూ. 50 పలుకుతోంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కురిసిన వర్షాల కారణంగా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి టమాటలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని... రవాణా ఖర్చులు ఎక్కువవుతుండడం వల్ల ధరలు పెంచి అమ్మవలసి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వారం క్రితం కిలో రూ. 10గా ఉన్న టమాట ఒక్కసారిగా 5 రెట్లు పెరగడం వల్ల సాధారణ జనాలు టమాట కొనాలంటేనే జంకుతున్నారు.
ఉల్లి తగ్గింది..! టమాట పెరిగింది...! - హైదరాబాద్
మొన్నటి వరకు ఉల్లి... ఇప్పుడు టమాట ధర సాధారణ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్లో కిలో టమాట రూ. 50 పలుకుతోంది. దీంతో వాటిని కొనాలంటేనే కొనుగోలుదారులు జంకుతున్నారు.
ఉల్లి తగ్గింది..! టమాట పెరిగింది...!