తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆన్​లైన్' మోసం... పోలీస్​స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన

ఓ టెక్నాలజీ సంస్థ నెలరోజుల్లోనే బోర్డు తిప్పేసింది! ఉద్యోగులనూ నట్టేటా ముంచేసింది. విసిగివేసారిన బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

ఆన్​లైన్​ విక్రయాల భారీ మోసం.. ఉద్యోగుల ఆందోళన

By

Published : Sep 8, 2019, 11:07 PM IST

ఆన్​లైన్​ విక్రయాల భారీ మోసం.. ఉద్యోగుల ఆందోళన

సికింద్రాబాద్​లోని హిమోగల్ టెక్నాలజీ ఆన్లైన్ సంస్థ భారీ మోసం చేసింది. సంస్థ యజమాని సయ్యద్ తస్లీమ్ మరో వ్యక్తి కలిసి ఉద్యోగులను కస్టమర్లను మోసం చేశారు. కస్టమర్ల నుంచి దాదాపు రెండు కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాల్ సెంటర్ మార్కెటింగ్ పేరుతో ఉద్యోగులను తీసుకొని ఆన్లైన్లో వస్తువులను విక్రయించే క్రమంలో కస్టమర్లను మోసగించినట్టు తెలుస్తోంది. కస్టమర్లు సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో ఏం చేయాలో పాలు పోక బేగంపేట పీఎస్​లో కేసు నమోదు వెళ్లారు. ఈక్రమంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని... ఉద్యోగులు స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగారు. కస్టమర్ల వేధింపులు తాళలేక కొంతమంది ఉద్యోగులు సూసైడ్ చేసుకోవడానికి యత్నించినట్టు బాధితులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details