దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాఖ్య ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్వేశ్వరుడి విగ్రహం వద్ద గల దిశ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. చట్టంలో కఠినమైన శిక్షలు లేకపోవడం వలనే మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్యాట్నీలోనూ...
మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్యాట్నీలోనూ మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడే నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ... మహిళలకు స్వేచ్ఛ రాలేదని సామాజిక కార్యకర్త మక్తల జలందర్ పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ భద్రత పట్ల మరిన్ని చర్యలు చేపట్టి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
దిశకు మద్దతుగా రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు ఇదీ చూడండి : దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్