మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు "ప్రతి ఆదివారం పది నిమిషాలు" కార్యక్రమంలో హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
'పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు దూరం'
హైదరాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లి కార్పోరేటర్ ముద్దం నరసింహ యాదవ్... "ప్రతి ఆదివారం పది నిమిషాలు" కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
old boinpally corporater participated in sanitation program
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే కరోనా వంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఓల్డ్ బోయిన్పల్లిలోనూ కేసులు పెరుగుతున్నాయని... ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని నరసింహ యాదవ్ కోరారు.