తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓజి కుప్పం ముఠా సభ్యుల అరెస్ట్ - OG KUPPAM GANG

ఓజి కుప్పం ముఠాకు చెందిన ఆకుల కిరణ్, తులసిందర్ ఇద్దరు పాత నేరస్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.9.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు పాత నేరస్తులేనని సీపీ స్పష్టం చేశారు.

OG KUPPAM GANG WAS ARRESTED BY TASK FORCE POLICE
ఓజి కుప్పం ముఠా సభ్యుల అరెస్ట్

By

Published : Feb 20, 2020, 5:51 PM IST

ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ఓజి కుప్పం ముఠాను అరెస్ట్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు కింద పడవేసి ప్రజల దృష్టి మరల్చి చోరీలు చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పట్టుబడిన వారు రాచకొండ, హైదరాబాద్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​లో పలు చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

పాత నేరస్తులే..

ఓజి కుప్పం ముఠాకు చెందిన ఆకుల కిరణ్, తులసిందర్ ఇద్దరు పాత నేరస్తులేనని సీపీ స్పష్టం చేశారు. ఆకుల కిరణ్​పై 23 కేసులు, తులసిందర్​పై 17 కేసులు ఉన్నాయన్నారు. కర్ణాటక నుండి హైదరాబాద్ వచ్చిన ఈ ముఠా సిటీలో చాలా చోట్ల దొంగతనాలు చేశారని తెలిపారు.

రూ.తొమ్మిది లక్షలు స్వాధీనం...

నిందితుల వద్ద నుంచి రూ.9.40 లక్షల నగదు,రెండు సెల్ ఫోన్స్, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వేరే రాష్ట్రంలో పోలీసులు క్యాష్ రివార్డ్ కూడా ఉందన్నారు. మొత్తం 300 సీసీ కెమెరాల ద్వారా వీరి కదలికలు గమనించి అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఓజి కుప్పం ముఠా సభ్యుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details