తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులకు 'అగ్ని' - FIRE SAFTY

యాజమాన్యాల అలసత్వమో... అధికారుల నిర్లక్ష్యమో... నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభంలేదని భావించిన అధికారులు.... ముందు జాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టారు.

అధికారులకు 'అగ్ని' పరీక్ష

By

Published : Feb 2, 2019, 5:18 PM IST

Updated : Feb 2, 2019, 6:30 PM IST

హైదరాబాద్​లో వరుస అగ్నిప్రమాదాలపై జలమండలి కార్యాలయంలో నగర సమన్వయ సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సజ్జనార్, మహేష్ భగవత్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్నిప్రమాదంపై చర్చించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం జోనల్​ కమిషనర్లు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్కెట్లు, ఎగ్జిబిషన్​లను పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలన్నారు.
రానున్న వర్షాకాలంలో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, మ్యాన్​హోల్స్​ విషయంలో ప్రణాళికబద్ధమైన చర్యలు చేపటనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
ప్రమాదం వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దాన కిషోర్​ సూచించారు.

Last Updated : Feb 2, 2019, 6:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details