ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు హైదరాబాద్ జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి దాన కిషోర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు. రిటర్నింగ్ అధికారులు, ఏఆర్‌వోలు, ఈఆర్‌వోలతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పోలీసులతో పాటు ఎన్నికల నిర్వహణకు అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు దాన కిషోర్ స్పష్టం చేశారు.
ఈవీఎంల మొదటి విడత తనిఖీల ప్రక్రియ ఈ నెల 25వరకు పూర్తి చేస్తామని దానకిషోర్ వివరించారు. ఈ నెల 22న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.