తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగస్ట్​ 7న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ - obc

బీసీల రాజకీయ ఉద్యమ నిర్మాణమే లక్ష్యంగా...ఆగస్టు 7న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు, మేథావులు హాజరుకానున్నారు.

ఆగస్ట్​ 7న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ

By

Published : Jul 25, 2019, 11:28 PM IST

రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌, అఖిల భారత బీసీ ఫెడరేషన్‌, రెండు తెలుగు రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ జరగనుంది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆగస్టు 7న జరగబోయే ఈ కార్యక్రమానకి 29 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నాయకులు, ప్రజాపతినిధులు, మేథావులు పాల్గొంటారని తెలంగాణ బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్‌తో తెలిపారు. మహాసభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. మా వృత్తులు వేరైనా మా నెత్తురు ఒక్కటే అన్నదే తమ నినాదమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభకు హాజరవుతారని పేర్కొన్నారు.

ఆగస్ట్​ 7న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ
ఇదీ చూడండి: "సంచార జాతుల కులాలను బీసీలుగా గుర్తిస్తాం"

ABOUT THE AUTHOR

...view details