తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓబీసీ కమిషన్.. చారిత్రాత్మకం! - COMISSION

ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి.. ఓబీసీ కమిషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదం చేయించిన మహోన్నత వ్యక్తి నరేంద్రమోదీ అని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొనియాడారు.

ఓబీసీ కమిషన్.. చారిత్రాత్మకం!

By

Published : Mar 1, 2019, 8:24 PM IST

ఓబీసీ కమిషన్.. చారిత్రాత్మకం!
ఓబీసీ కమిషన్‌ బిల్లును పార్లమెంటులో మోదీ ఆమోదింపచేయించడం చారిత్రాత్మకమైనదని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని భాజపా గ్రేటర్‌ కార్యాలయంలో ఓబీసీ మోర్చా నిర్వహించిన సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి దత్తత్రేయ, భాజపా కార్యకర్తలు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఉన్న చట్టబద్ధత మాదిరిగానే ఓబీసీలకు కూడా కమిషన్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

10న ఓబీసీ మోర్చా సభ:

ఈనెల 10న హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ స్మారక పాఠశాల గ్రౌండ్‌లో ఓబీసీ మోర్చా సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఓబీసీల సంక్షేమానికి భాజపా ప్రభుత్వం కట్టుబడి ఉందని దత్తాత్రేయస్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details