Numaish Exhibition 2024 in Nampally Grounds : నగరంలో నిర్వహించబోయే నుమాయిష్-2024 ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో(Nampally Exhibition Grounds) జరగనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు.
'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'
Numaish Exhibition 2024 in Hyderabad : పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదికని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. స్వాతంత్య్రం పూర్వం నుంచి సాగుతున్న ఈ ప్రదర్శనకు ఎంతో చరిత్ర ఉందన్నారు. నగరంలో జరిగే నుమాయిష్(Numaish- 2024) ప్రదర్శనకు 15 రోజుల్లో లక్షల మంది ప్రజలు ప్రదర్శనను తిలకించడానికి వస్తారన్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది : డిప్యూటీ సీఎం భట్టి
ఈసారి 2400 పైచిలుకు ఎగ్జిబిటర్లు వస్తున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఎగ్జిబిటర్లు తరలి వస్తున్నారన్నారు. తొలిసారిగా నూమాయిష్‌లో శాఖాహారం రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అపోలో యాజమాన్యం కూడా ఓ క్లీనిక్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నుమాయిష్ ప్రదర్శనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
"జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్- 2024 ప్రదర్శన ప్రారంభమవుతోంది. జనవరి 1 నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. స్వాతంత్య్రం పూర్వం నుంచి సాగుతున్న ఈ ప్రదర్శనకు ఎంతో చరిత్ర ఉంది. ఈసారి 2400 పైచిలుకు ఎగ్జిబిటర్లు వస్తున్నారు. నుమాయిష్ ప్రదర్శనను విజయవంతం చేయాలి". - శ్రీధర్ బాబు, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి
నుమాయిష్‌కు వేళాయే జనవరి 1 నుంచి ఇక సందడే సందడి 'కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి'