జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ - తెలంగాణలో భూముల విక్రయం
08:55 February 11
హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ద్వారా జిల్లాల్లో భూముల విక్రయం
Notification for Land Sales: నిధుల సమీకరణ కోసం హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల అమ్మకాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జిల్లాల్లోనూ భూములను విక్రయించనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్నగర్, నల్గొండ, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్లాట్లను విక్రయించనుంది. కనిష్ఠంగా 60 చదరపు గజాల నుంచి గరిష్ఠంగా 6,500 చదరపు గజాల వరకు స్థలాలు ఉన్నాయి.
చదరపు గజానికి కనీస ధర రూ.5వేలు ఉండగా... గరిష్ఠంగా రూ.40వేలు ఉంది. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ద్వారా భూములను విక్రయిస్తారు. ఈ నెల 18, మార్చి 7వ తేదీన ప్రీబిడ్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మార్చి 14, 15, 16, 17 తేదీల్లో భూముల అమ్మకం కోసం వేలం నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి :CM KCR JANGAON TOUR: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన