గాంధీ ఆస్పత్రిలో శనివారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభం అవుతునట్టు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రకటించారు. కరోన నేపథ్యంలో మార్చి 24 నుంచి సాధారణ సేవలు ముగిసిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు రేపట్నుంచి గాంధీలో సాధారణ సేవలు.. - Launch of Services for Non covid Patients
రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎనిమిది నెలల విరామం అనంతరం సాధారణ రోగులకు కూడా సేవలు మొదలు కానున్నాయి.
ఇటీవల రాష్ట్రంలో కరోన కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో గాంధీలో ఇతర వైద్య సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే గాంధీలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన సదుపాయాలు పూర్తి చేసినట్లు రాజారావు చెప్పారు.
అన్ని విభాగాల ఓపీ, సర్జరీ సేవలు, స్పెషలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్న రాజారావు..... రోగుల వెంట కేవలం ఒకరు మాత్రమే రావాలని పేర్కొన్నారు. మాస్క్ లేని వారిని ఆసుపత్రి పరిసరాల్లోకి అనుమతించేది లేదన్న ఆయన.... కొవిడ్ , నాన్ కొొవిడ్ రోగులకు వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.