Nodal Officers Appointed for Praja Palana Programme :రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ఐఏఎస్ అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శ్రీదేవసేన, మహబూబ్ నగర్‌కు టి.కె.శ్రీదేవి, ఖమ్మం జిల్లాకు ఎం.రఘునందన్ రావును నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం - Praja palana telangana
Nodal Officers Appointed for Praja Palana Programme : ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
Published : Dec 27, 2023, 8:16 PM IST
Praja palana Program in Telangana :రంగారెడ్డి జిల్లాకు ఇ.శ్రీధర్, వరంగల్‌కు వాకాటి కరుణ, హైదరాబాద్ జిల్లాకు కె.నిర్మల, మెదక్ జిల్లాకు ఎస్.సంగీత, ఆదిలాబాద్‌కు ఎం.ప్రశాంతి, నల్గొండకు ఆర్.వి.కణ్ణన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు క్రిస్టినా చౌంగ్తులను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రజాపాలన నిర్వహణకు నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఈనెల 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
జిల్లాల వారీగా నోడల్ అధికారులు :
- రంగారెడ్డి - ఇ.శ్రీధర్
- వరంగల్ - వాకాటి కరుణ
- హైదరాబాద్ - కె.నిర్మల
- మెదక్ - ఎస్.సంగీత
- ఆదిలాబాద్ - ఎం.ప్రశాంతి
- నల్గొండ - ఆర్.వి.కణ్ణన్
- ఉమ్మడి నిజామాబాద్ - క్రిస్టినా చౌంగ్తు
- ఉమ్మడి కరీంనగర్ - శ్రీదేవసేన
- ఉమ్మడి మహబూబ్ నగర్ - టి.కె.శ్రీదేవి
- ఉమ్మడి ఖమ్మం - ఎం.రఘునందన్ రావు