హైదరాబాద్లోని పలు ఏరియాల్లో ఇవాళ తాగునీటికి అంతరాయం ఏర్పడనుంది. ఓఆర్ఆర్ గ్రామాలకు మంచి నీటిని అందించే ఘన్పూర్ నుంచి సైనిక్ పురి మధ్య గోదావరి పైపులైన్ కలదు. ఈ పైపులైన్లకు పనులను చేపట్టడంతో ఇవాళ పలు కాలనీల్లో తాగునీటి సరఫరాను నిలిపివేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మంచినీటి సరఫరా అంతరాయం ఏర్పడనుందన్నారు.
ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం
నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తాగునీటికి అంతరాయం కలుగనుంది. దీంతో ఓఆర్‌ఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.
హాస్మత్ పేట్, బషీర్బాద్ బ్యాంక్ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్ కాలనీ, గౌతమ్ నగర్, చాణిక్యపురి, తిరుమల్ నగర్, గాయత్రి నగర్, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, ఫాదర్ బాలయ్య నగర్, ఓయూటి కాలనీ, రాధిక, చెర్లపల్లి, కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హాకీంపేట్, సింగాయిపల్లి, దేవర యాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మాద్ గూడ, మెస్ త్రిశూల్, గన్ రాక్, కంటోన్మెంట్ బోర్డు, రుద్రనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుందని వివరించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు కోరారు.
ఇదీ చూడండి : యాదాద్రి రహదారి విస్తరణ జరిగేనా...?