తెలంగాణ

telangana

ETV Bharat / state

'డిగ్రీ కాలేజ్'లో ఆ సన్నివేశాలు తొలగించారు - NO OBJECTIONARY SCENES IN DEGREE COLLEGE

డిగ్రీ కాలేజ్  తెలుగు చలనచిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించారని తల్లిదండ్రుల సంఘం, ఎస్​ఎఫ్ఐ నేతలు తెలిపారు. చిత్రాన్ని ఇప్పుడు అందరూ చూడొచ్చని చెప్పారు.

'డిగ్రీ కాలేజ్​పై అభ్యంతరాల్లేవ్'
'డిగ్రీ కాలేజ్​పై అభ్యంతరాల్లేవ్'

By

Published : Feb 10, 2020, 8:11 AM IST

డిగ్రీ కాలేజ్ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించారని, ఇప్పడు సినిమా చాలా బాగుందనితల్లిదండ్రుల సంఘం, ఎస్​ఎఫఐ నేతలు తెలిపారు. హైదరాబాద్ బాగ్ ​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రేమికులు, తల్లిదండ్రుల మధ్య జరిగే సంఘర్షణ కళ్లకు కట్టినట్లు దర్శకుడు చిత్రీకరించారని రాష్ట్ర తల్లి దండ్రుల సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ వివరించారు. కుల దురహంకార హత్యలు నేడు ఏ విధంగా జరుగుతున్నాయో... వాటి ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండనున్నయో ఆయా సందేశాలను చిత్రంలో చూపించారని తెలిపారు. ప్రధానంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించారని అన్నారు. విద్యార్థుల ఉత్సాహంతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరించారని... వ్యవహార శైలి బాగుందని ఎస్ఎఫ్ఐ నేత శృతి చెప్పారు.

'డిగ్రీ కాలేజ్​పై అభ్యంతరాల్లేవ్'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details