హైదరాబాద్లో ఇక నుంచి పోలీసు విభాగంలో కొత్త విధానం అమలు కానుంది. బాధితులు పోలీసుస్టేషన్‌లకు వెళ్లకుండా నేరుగా పెట్రోలింగ్ వాహనాల్లో ఫిర్యాదు చేయవచ్చని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ఏడాది నుంచి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.
''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"
నేరంపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. మీరుండే ప్రాంతంలోని గస్తీ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎఫ్‌ఐఆర్ కోసం కూడా స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"
బాధితులు సమీపంలోని పెట్రోలింగ్ వాహనాల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. తద్వారా వారు ఎఫ్ఐఆర్ను కూడా పొందవచ్చని పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌లో లభించే సేవలు పెట్రోలింగ్ వాహనాల్లో కూడా లభిస్తాయని అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసే వారు తమ చిరునామా, ఫోన్ నెంబరు ఖచ్చితంగా వాహనంలోని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.